Kingdom | రౌడీ హీరో విజయ్ దేవరకొండని వరుస ఫ్లాపులు పలకరిస్తున్నా కూడా ఆయన క్రేజ్ తగ్గడం లేదు. విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా విజయ్ హీరోగా ‘కింగ్డమ్’ అనే చిత్రం రూపొందింది.. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించాడే. ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేసింది.
ఇప్పటికే కింగ్డమ్ బాయ్స్ అంటూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాటు విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కలిసి ఒక పాడ్ కాస్ట్‌ని విడుదల చేయగా, అది అందరిని అలరించింది. మరోవైపు నేడు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ వేడుక ప్లాన్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ వేడుకని హైదరాబాద్‌లో జూలై 28న నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. మేకర్స్ సినిమాపై మంచి హైప్ తెస్తున్నారు. జూలై 30న యుఎస్‌లో ప్రీమియర్ షోలు జరగనుండగా, బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే పదివేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని చిత్రబృందమే అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేసింది. కింగ్డమ్ క్రేజ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కానుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ చూసిన బోర్డు సభ్యులు “సినిమా అదిరిపోయిందంటూ” ప్రశంసలు కురిపించారట. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా ఈ ఏడాది టాలీవుడ్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవబోతోందని అభిమానులు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు. కాగా, విజయ్ గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ తరహా పాత్రలు చేయగా, ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని, మళ్లీ యాక్షన్ ఫుల్ అవతార్‌లో ‘కింగ్డమ్’ తో స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాడు. ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ లాంటి క్లాసిక్స్ రూపొందించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను ఎవరు ఊహించని విధంగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు.