హైదరాబాద్, ఆట ప్రతినిధి: రానున్న దేశవాళీ సీజన్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు యువ క్రికెటర్ తిలక్‌వర్మ నాయకత్వం వహించబోతున్నాడు. నాగాలాండ్, మేఘాలయతో జరిగే తొలి రెండు మ్యాచ్‌ల్లో తిలక్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగనుంది.
రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.