Tilak Varma : పొట్టి క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) మరో రికార్డు నెలకొల్పాడు. ఆకాశమే హద్దుగా ఆడుతున్న ఈ చిచ్చరపిడుగు టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలతో రికార్డుల వీరుడిగా అవతరించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు మ్యాచుల్లో శతకంతో రెచ్చిపోయిన తిలక్.. స్వదేశంలోనూ జోరు చూపిస్తూ వంద కొట్టేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పసికూన మేఘాలయా(Meghalaya) బౌలర్లను ఉతికేసిన ఈ తెలుగు కుర్రాడు హ్యాట్రిక్ సెంచరీ నమోదు చేశాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్ తన విధ్వంసక ఇన్నింగ్స్‌తో 67 బంతుల్లోనే 151 పరుగులు బాదేశాడు.
🚨 𝙈𝙞𝙡𝙚𝙨𝙩𝙤𝙣𝙚 𝘼𝙡𝙚𝙧𝙩 🚨
Tilak Varma 🤝 Record-breaking Feat! 🔝 🙌
Congratulations! 👏 👏#TeamIndia | #SMAT pic.twitter.com/4BnLFZzRRf
— BCCI Domestic (@BCCIdomestic) November 23, 2024
పొట్టి ఫార్మాట్లో చెలరేగి ఆడే తిలక్ ఈ ఏడాది యమ స్పీడ్మీదున్నాడు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రపుటల్లో నిలిచాడు. అంతేకాదు ప్రతిష్ఠాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 150 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కొత్త రికార్డు లిఖించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 150కి పైగా స్కోర్ చేసిన రెండో భారత ఆటగాడిగా తిలక్ మరో రికార్డు సృష్టించాడు.