Duleep Trophy : దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) విధ్వంసం మరువకముందే మరో ఇద్దరు శతకంతో గర్జించారు. ‘ఇండియా ఏ’ తరఫున ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(111 నాటౌట్), ప్రథమ్ సింగ్(122)లు సెంచరీలతో ఇండియా డీ బౌలర్ల భరతం పట్టారు. ఇప్పటివరకూ టీ20ల్లో దంచేసిన తిలక్.. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్లోనూ వీర కొట్టుడు కొట్టాడు. మరో ఎండ్‌లో ప్రథమ్ కూడా రెచ్చిపోయి ఆడడంతో రెండో ఇన్నింగ్స్‌ను ఇండియా ఏ పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం బ్యాటింగ్ మొదలెట్టిన ఇండియా డీ పోరాడుతోంది. డేంజరస్ ఓపెనర్ అథర్వ తైడేను అకీబ్ ఖాన్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత యశ్ దూబే(15), రికీ భూయి(44)లు ఆచితూచి ఆడారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ఇంకా 426 పరుగులు వెనకే ఉంది.
Creativity & Placement 👌👌
Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z
— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024
మరో మ్యాచ్‌లో ఇండియా బీ ఆలౌట్ ప్రమాదంలో పడింది. సహచరులు బ్యాట్లు ఎత్తేస్తున్నా కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(143 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తొలి వికెట్‌కు జగదీశన్(74)తో కలిసి 129 రన్స్ జోడించిన అభిమన్యుకు ఆ తర్వాత సహకరించేవాళ్లు కరువయ్యారు. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(1), ధనాధన్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్(16)లు నిరాశపరిచారు.
అభిమన్యు ఈశ్వరన్(143 నాటౌట్)
దాంతో, టెయిలెండర్ల సాయంతో సాధ్యమైనన్ని పరుగులు చేయడంపై దృష్టి పెట్టిన అభిమన్యు ఎలాగోలా జట్టు స్కోర్ మూడొందలు దాటించాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా బీ 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 216 రన్స్ వెనకబడి ఉంది. మొదట ఆడిన ఇండియా ఏ 525కు ఆలౌటయ్యింది. ఇషాన్ కిషన్(111) శతకంతో విజృంభించగా.. మానవ్ సుతార్(82), బాబా ఇంద్రజిత్(78), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(54)లు అర్ధ శతకాల మోత మోగించారు.