గురుగ్రామ్: భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే అండర్‌పాస్‌లోకి భారీగా వరద నీరు చేరింది. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ ప్రయాణించిన ఎస్యూవీ అక్కడ మునిగిపోయింది. ఈ సంఘటనలో వారిద్దరూ మరణించారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కాగా, గురుగ్రామ్ సెక్టార్ 31లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పుణ్యశ్రేయ శర్మ, క్యాషియర్ విరాజ్ ద్వివేది శుక్రవారం సాయంత్రం మహీంద్రా వాహనంలో ఫరిదాబాద్‌లోని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. అయితే ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్ వద్ద భారీగా వరద నీరు చేరింది. అయినప్పటికీ తమ కారులో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ఎస్యూవీ అక్కడ చిక్కుకుని మునిగిపోయింది.
మరోవైపు వరద నీటిలో మునిగిన వాహనం నుంచి దిగి ఈదడానికి బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ ప్రయత్నించారు. అయితే ఆ నీటిలో మునిగి వారు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మునిగిన వాహనాన్ని బయటకు తీయగా అందులో మేనేజర్ శర్మ మృతదేహం ఉంది. పలు గంటలపాటు గాలింపు తర్వాత శనివారం తెల్లువారుజామున 4 గంటల సమయంలో క్యాషియర్ విరాజ్ ద్వివేది మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
हरियाणा : फरीदाबाद में रेलवे अंडरब्रिज के नीचे भरे बारिश के पानी में महिंद्रा XUV-700 डूब गई। इसमें बैठे HDFC बैंक मैनेजर पुण्यश्रेय शर्मा और कैशियर विराज द्विवेदी की मौत हुई।
अंदाजा नहीं था कि पानी इतना भरा होगा। कार पानी में बंद होकर लॉक हो गई। वो बाहर नहीं निकल सके। pic.twitter.com/CBq5ZJ3CXf
— Sachin Gupta (@SachinGuptaUP) September 14, 2024