Devara Movie | జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి అంటూ ఓ బ్లడ్ క్యాన్సర్ బాధితుడు ఇటీవలే డాక్టర్లను వేడుకున్న వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్(19) అనే యువకుడు జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. తారక్ సినిమా వస్తుందంటే చాలు మార్నింగ్ షో పడకముందే థియేటర్ లోపల ఉంటాడు. అయితే కౌశిక్ ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. బెంగళూరులోని కిడ్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తాను కొన్ని రోజులే బ్రతుకుతానని డాక్టర్లు చెబుతున్నారు. నేను చనిపోయే లోగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలి అంటూ వేడుకున్నాడు. కౌశిక్ అమ్మ కూడా మాట్లాడుతూ.. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని, చంద్రబాబు, పవన్, జూ.ఎన్టీఆర్ స్పందించాలని వేడుకుంటుంది.
అయితే ఈ ఘటనపై తాజాగా ఎన్టీఆర్ స్పందించాడు. నేరుగా కౌశిక్‌కు వీడియో కాల్ చేశాడు. కౌశిక్‌ను చూసి నువ్వు నవ్వుతుంటే బాగున్నావు. ఇలాగే ఉండాలి. దేవర సినిమా తర్వాత చూస్తావు. ఫస్ట్ నువ్వు కోలుకోవాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటూ కౌశిక్‌కు భరోసా ఇచ్చాడు. కౌశిక్ అమ్మతో తారక్ మాట్లాడుతూ.. అమ్మ మీరు ధైర్యంగా ఉండాలి.. మీరు ధైర్యంగా ఉంటే అతడికి కొండంతా బలం వస్తుంది. కౌశిక్ చికిత్సకు సంబంధించి అవసరమైనవన్ని దగ్గరుండి చూసుకుంటాను అంటూ తారక్ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
https://t.co/RfExyVdBJV pic.twitter.com/aKAuXTG8bZ
— Vamsi Kaka (@vamsikaka) September 14, 2024
also read..