బెంగళూరు: సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. మరోమ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఆదివారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తున్నది. గత మ్యాచ్‌లో పరుగుల వరద పారిన నేపథ్యంలో ఆఖరి పోరులోనూ బ్యాటర్ల హవా కొనసాగే అవకాశముంది.
ముఖ్యంగా నాయక ద్వయం హర్మన్‌ప్రీత్‌కౌర్, స్మృతి మందన సూపర్ ఫామ్ మీదుండటం టీమ్ఇండియాకు కలిసి రానుంది. సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కౌర్, మందన బ్యాటింగ్ జోరు కొనసాగిస్తున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేసేలా కనిపించడం లేదు. రెండో వన్డేలో కెప్టెన్ వోల్వార్డ్, మారిజానె కాప్ సెంచరీలతో టచ్‌లోకి వచ్చారు.