హైదరాబాద్, ఆట ప్రతినిధి: ముంబైతో ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ ఎదురీదుతున్నది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో విఫలమైన హైదరాబాద్ భారీ ఓటమికి చేరువలో ఉంది. 293 పరుగుల లోటుతో ఫాలోఆన్‌కు దిగిన హైదరాబాద్ ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 166 పరుగులతో కొనసాగుతున్నది. చేతిలో మూడు వికెట్లు ఉన్న హైదరాబాద్ ఇంకా 127 పరుగుల వెనుకంజలో ఉన్నది. సీనియర్ ప్లేయర్ సీవీ మిలింద్(30 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. మోహిత్ అవ స్తి(3/31), ముషీర్‌ఖాన్(3/38) ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు.
హిమతేజ(43) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 138/2తో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ 267 పరుగులకు ఆ లౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ హిమతేజ(96) నాలుగు పరుగుల తేడాతో సెం చరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
ముం బై కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. హిమాంశుసింగ్(3/39), తుషార్(2/68), మోహిత్(2/54).హైదరాబాద్ పతనంలో కీలకమయ్యారు.