బెంగళూరు : సెమీస్ స్థానంకోసం పాకులాడుతున్న జట్టు ఒకటి. సెమీస్‌కు అర్హత కోల్పోయిన జట్టు మరొకటి. ఈ మ్యాచ్ గెలిచి నాకౌట్‌కు చేరుకోవాలని కివీస్ జట్టు భావిస్తుంటే చివరి మ్యాచ్‌లో విజయంతో ముగించాలని శ్రీలంక ఆశిస్తున్నాయి. లంక కంటే కివీస్‌కే ఈ మ్యాచ్ కీలకం. కేవలం విజయం మాత్రమే కివీస్‌ను నాకౌట్‌కు చేర్చదు. నెట్న్‌ర్రేట్‌ను కూడా ఎంతో మెరుగుపరచుకోవాలి.
అందుకు భారీ విజయం అవసరం. కివీస్ బ్యాటర్లు రాణిస్తున్నా వారి బౌలర్లు ఇంకా పట్టు సాధించలేకపోతున్నారు. ఇదే వేదికలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 400కు పైగా పరుగులు సాధించినా, బౌలర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించే చాన్స్ ఉంది.