డర్బన్: ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో ఆదిలోనే భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు. కెప్టెన్ లారా వోల్వార్డ్(51) అర్ధసెంచరీకి తోడు అనెరీ డెర్క్సన్(44 నాటౌట్) టీమ్ముఖ్యంగా వోల్వార్డ్ తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లతో ఆకట్టుకుంది.
సునె లుస్(13), తజ్మిన్ బ్రిట్స్(10) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా..డెర్క్సన్తో కలిసి వోల్వార్డ్ జట్టు విజయంలో కీలకమయ్యారు. శ్రేయాంక పాటిల్(2/26)ఆకట్టుకుంది. అంతకముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(47 నాటౌట్), రోడ్రిగ్స్(36), షెఫాలీవర్మ(34) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. కాకా(3/16), సెకునె(2/27) రాణించారు.