Egg Price | కోడిగుడ్లు కొనలేం.. మధ్యాహ్న భోజన వర్కర్ల గగ్గోలు!
Egg Price | ‘ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున ఇస్తున్నది. మార్కెట్లో ధర చూస్తే రూ.8.50 పలుకుతున్నది. విద్యార్థులకు వా రానికి 3 గుడ్లు అందించాల్సి ఉన్నది. అంత ధరతో కొనలేకపోతున్నాం’ అని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు.
Egg Price | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున ఇస్తున్నది. మార్కెట్లో ధర చూస్తే రూ.8.50 పలుకుతున్నది. విద్యార్థులకు వా రానికి 3 గుడ్లు అందించాల్సి ఉన్నది. అంత ధరతో కొనలేకపోతున్నాం’ అని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. గుడ్డు ధరాభారంతో ఏజెన్సీలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి.
మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ. 8.50
సర్కార్ బడుల్లోని విద్యార్థులకు అందిస్తు న్న ప్రధాన ప్రొటీన్ ఆహారం గుడ్డు. పాఠశాల ల్లో 10 లక్షల మంది విద్యార్థులకు వారంలో మూడు గుడ్లు అందజేయాల్సి ఉన్నది. ఇటీవల కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. ఇదివరకు బహిరంగ మార్కెట్లో రూ.6గా ఉన్న కోడిగుడ్డు ధర.. ఇప్పుడు రూ.8.50కి చేరింది. కొన్నిచోట్ల ఒక గుడ్డుకు రూ.9 కూడా తీసుకొంటున్నారు. ఈ ధరల పెరుగుదలతో సరఫరాదారులపై ఆర్థికభారం పడుతున్నది. దీంతో వంట కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని సర్దుబాటు చేసుకొనేందుకు 3 గుడ్ల కు బదులు 2 మాత్రమే అందిస్తున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా లు, స్థానిక ప్రజాప్రతినిధులు మధ్యాహ్న భోజన ఏజెన్సీలను నిలదీస్తున్నాయి.
ఏడాదికి రూ.30.35 కోట్ల మేర నష్టం
కోడిగుడ్ల రూపంలోనే మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, మహిళా సంఘాలు రూ.30.35 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తున్నది. ఒక్కో గుడ్డుకు రూ.2 చొప్పున నష్టపోతున్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ఓ పాఠశాలలో 52 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వమిచ్చే లెక్క ప్రకారం కోడిగుడ్లకు రోజుకూ రూ.312 అందుతున్నది. వంట కార్మికులు మాత్రం రోజుకు రూ.442 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ ఒక్క స్కూల్ ఏజెన్సీ రోజుకు రూ.130, వారంలో మూడు రోజుల్లో అంటే రూ.400 వరకు నష్టపోతున్నారు. కూరగాయల ధరలు, గుడ్ల ధరల భారం కూడా మోయలేకపోతున్నారు. వంట కార్మికులకు పారితోషికం కింద రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నారు. అసలే చాలీచాలని పారితోషికానికి తోడు, ధరాఘాతంతో ఏజెన్సీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన పాత ఒప్పంద రేట్ల ప్రకారం కోడిగుడ్లు అందించలేమని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు తేల్చి చెప్తున్నాయి. మారెట్ ధరలకు అనుగుణంగా గుడ్డు రేట్లను సవరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
- మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులు – 10,55,756
- రోజుకు రూ.6 చొప్పున ఇస్తే అయ్యే వ్యయం – రూ.63,34,536
- రోజుకు రూ.8.50 చొప్పున అయ్యే ఖర్చు – రూ.89,73,926
- మధ్యాహ్న భోజన వర్కర్లకు రోజుకు నష్టం – రూ.26,39,390
- ఏడాదిలో (115 రోజులకు) అయ్యే నష్టం – రూ.30,35,29,850
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

