హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నా య పంటలవైపు మళ్లించాలని, రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన పెంచాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ఆస క్తి చూపిస్తున్నారని, వారికి మొక్కలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. రైతులు నర్సరీలకు వెళ్లినప్పుడు మొక లు అందుబాటులో లేవని వెనుకకు వెళ్లే పరిస్థితి రాకూడదని స్పష్టంచేశారు. ప్రతి జిల్లాలో, ప్రతి ఆయిల్‌పామ్ విస్తరణ ప్రాంతంలో రైతుల డిమాండ్‌కు అనుగుణంగా మొకల ఉత్పత్తి చేపట్టాలని సూచించారు.
ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సంబంధించిన మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్ వంటనూనెల విక్రయాలను పెంపొందించే దిశగా మారెట్ విస్తరణ, విసృ్తత ప్రచార కార్యక్రమాలు, విక్రయ ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని చెప్పారు.