ఢిల్లీ: ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన పోరులో భారత్.. 4-8తో జపాన్ చేతిలో ఓటమిపాలైంది.
చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ రెండో పూల్ మ్యాచ్‌లో భారత్.. సింగిల్స్ విభాగాల్లో మణికా బత్రా, మానవ్ ఠక్కర్‌కు విజయాలు దక్కినా డబుల్స్ క్యాటగిరీ ఆటగాళ్లు చతికిలపడ్డారు.