Team India | ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజేత భారత మహిళల జట్టు గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా చారిత్రక విజయం సాధించిన జట్టును రాష్ట్రపతి అభినందించారు. ప్రధానిని ఆయన నివాసంలో బుధవారం టీమిండియా కలిసిన విషయం తెలిసిందే. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను సాధించింది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టు జెర్సీని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు అందించారు. మహిళలు చరిత్ర సృష్టించారని, యువ తరానికి ఆదర్శంగా నిలిచారంటూ జట్టును ద్రౌపది ముర్ము అభినందించారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. తమకు ఈ టోర్నీ ప్రత్యేకమైందని తెలిపింది. టీమ్ గొప్ప విషయం ఏమిటంటే.. ఐసీసీ వరల్డ్ కప్ భారత్‌లో జరుగుతుందని తెలిసిన క్షణం నుంచి.. ఏదేమైనా దేశం కోసం ఈ ట్రోఫీని గెలుస్తామని తామంతా నిర్ణయించుకున్నామని పేర్కొంది. ఈ రోజు మా జీవితంలోని అతిపెద్ద క్షణాన్ని మీతో పంచుకోవడం అద్భుతంగా అనిపిస్తుందని.. రాష్ట్రపతి భవన్‌కు మరోసారి పిలిచినందుకు ధన్యవాదాలు తెలిపింది. ట్రోఫీని ప్రెసిడెంట్‌కు అందించడం గౌర్వంగా ఉందని హర్మన్ చెప్పింది.
Members of the Indian Women Cricket team, winner of the ICC Women’s Cricket World Cup 2025 called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. The President congratulated the team and said that they have created history and have become role models for younger generation.… pic.twitter.com/lHBBXRcPh5
— President of India (@rashtrapatibhvn) November 6, 2025