ఖమ్మం X హైదరాబాద్
హోరాహోరీ పోరాటాలతో సాగుతున్న టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేత ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టుతో ఖమ్మం ఏసెస్ అమీతుమీ తేల్చుకోనుంది.
- నేడే టీజీ 20 ఫైనల్.. రా. 7.15 నుంచి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హోరాహోరీ పోరాటాలతో సాగుతున్న టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేత ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టుతో ఖమ్మం ఏసెస్ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అభిరథ్ రెడ్డి కెప్టెన్సీలోని హైదరాబాద్‌ను క్వాలిఫయర్-1లో ఓడించి ఖమ్మం ఫైనల్ చేరుకుంది.
ఖమ్మం తరఫున బ్యాటింగ్‌లో కె. హిమతేజ (430 రన్స్), బౌలింగ్‌లో 16 ఏండ్ల స్పిన్నర్ వేద్ రెడ్డి (14 వికెట్లు) అద్భుతంగా రాణిస్తుండగా.. కెప్టెన్ సీవీ మిలింద్ ఆల్‌రౌండ్ నైపుణ్యం ఆ జట్టుకు అతి పెద్ద బలం. మరోవైపు హైదరాబాద్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి టోర్నీలో ఇప్పటికే 500 రన్స్ దాటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అజయ్ దేవ్‌గౌడ్ (19 వికెట్లు) బంతితో సత్తా చాటుతున్నాడు. ఇక, ఫైనల్ మ్యాచ్‌కు ముందు సింగర్ రాహుల్ సిప్లింగజ్ లైవ్ పెర్ఫామెన్స్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

