దుబాయ్: ఇంగ్లండ్ వేదికగా జూన్‌లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్‌మనీ ప్రకటించింది. గత ఎడిషన్‌కు పది శాతం ఎక్కువ మొత్తాన్ని జత చేస్తూ రికార్డు స్థాయిలో రూ.82 కోట్లుగా నిర్ణయించింది. ఇంగ్లండ్‌తో పాటు వేల్స్లో ఐదు వేదికల్లో జరిగే మెగాటోర్నీలో మొత్తం పన్నెండు జట్లు బరిలో ఉన్నాయి. చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా ఫైనల్ పోరు జరుగనుంది. మొత్తం రూ.82కోట్ల ప్రైజ్‌మనీలో విజేతకు రూ.21.8కోట్లు, రన్నరప్ టీమ్‌కు రూ.10 కోట్లు దక్కనున్నాయి.
సెమీఫైనల్ టీమ్‌లకు రూ.6.29 కోట్లు, గ్రూపు దశలో వైదొలిగే జట్లకు రూ.29 లక్షల చొప్పున కేటాయించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మెగాటోర్నీలో ఆతిథ్య ఇంగ్లండ్ సహా భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీలో ఉన్నాయి. మొత్తం 24 రోజుల పాటు 33 మ్యాచ్‌లు జరుగునున్నాయి.