Australia | లండన్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-2తో కైవసం చేసుకుంది. ఆదివారం బ్రిస్టోల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా.. 49 పరుగుల తేడా (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో)తో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 49.2 ఓవర్లలో 309 పరుగులు చేసింది.
అనంతరం వర్షం కురిసే సమయానికి కంగారూలు.. 20.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.