ముంబై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజ న్ కొత్త హంగులతో రాబోతున్నది. అభిమానులకు మరింత మజా ను అందించాలన్న ఉద్దేశంతో లీగ్ ఫార్మాట్లో మార్పులు, చేర్పులు చేశారు. ఈనెల 29 నుంచి విశాఖపట్నం వేదికగా మొదలయ్యే లీగ్ జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో జరుగనుంది.
ఈసారి లీగ్ దశలో మొత్తం 108 మ్యాచ్‌లు ఉంటాయి. ప్రతీ టీమ్ 18 మ్యాచ్‌లు ఆడుతుంది. ఫలితం సమమైతే విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకింగ్ నిర్వహిస్తారు. దీనికి తోడు గోల్డెన్ రైడ్ విధానాన్ని లీగ్ స్టేజ్‌కు వర్తింపజేశారు. కొత్తగా ప్లేఇన్స్ అనే రౌండ్‌తో పాటు ప్లేఆఫ్స్ విధానంలోనూ మార్పులు చేశారు. దీని ద్వారా టాప్-8 జట్లకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశముంటుంది.