హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) జరుగబోయే ఎన్నికల్లో తమ ప్రాతినిధులను అనుమతించకపోవడంపై తెలంగాణ స్కాష్ రాకెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 25న జారీ చేసిన ఎన్నికల ప్రొసీడింగ్స్‌లో రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులను తొలిగించిందని పిటీషనర్ కార్యదర్శి శ్రీవాసు అన్నారు.
క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న అసోసియేషన్‌ను తప్పించడం అన్యాయమన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి స్కాష్ పోటీల్లో పాల్గొనే సంస్థల గుర్తింపునకు తమ అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. ఐవోఏ ఎన్నికల్లో పాల్గొనేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. దీనిపై ఈ నెల 30న విచారణ జరిగే అవకాశం ఉంది.