హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్(ఒడిశా) వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్ల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే శ్రీకాంత్, వరుణ్, శ్రీతేజ పతకాలతో మెరువగా, తాజాగా ప్రణయ్ ఆకట్టుకున్నాడు.
బుధవారం జరిగిన ట్రిపుల్ జంప్ ఫైనల్లో ప్రణయ్ 15.07మీటర్ల దూరంతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ప్రణయ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కాంస్యం సాధించిన ప్రణయ్‌ను జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ ప్రత్యేకంగా అభినందించారు.