జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్ల పతక జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన బాలికల అండర్-16 600మీటర్ల రేసులో తెలంగాణ యువ అథ్లెట్ నల్లవెల్లి ఆనంది కాంస్య పతకంతో మెరిసింది.
ఒడిశా వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్లు నైని శ్రీకాంత్, అప్పాల వరుణ్, తోలెం శ్రీతేజ అదరగొట్టారు.