హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఒడిశా వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ అథ్లెట్లు నైని శ్రీకాంత్, అప్పాల వరుణ్, తోలెం శ్రీతేజ అదరగొట్టారు. మంగళవారం జరిగిన పెంటాథ్లాన్ ఈవెంట్లో శ్రీకాంత్ 3905 పాయింట్లతో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పుతూ పసిడి పతకం దక్కించుకోగా, వరుణ్ 3856 పాయింట్లతో రజతం కైవసం చేసుకున్నాడు.
మరోవైపు హెప్టాథ్లాన్‌లో శ్రీతేజ 5087 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా ముగ్గురు అథ్లెట్లు జాతీయ స్థాయిలో సత్తాచాటి రాష్ట్ర ఖ్యాతిని పెంచారు.