భువనేశ్వర్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్ల పతక జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన బాలికల అండర్-16 600మీటర్ల రేసులో తెలంగాణ యువ అథ్లెట్ నల్లవెల్లి ఆనంది కాంస్య పతకంతో మెరిసింది.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన రేసును 1:34:63సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో సెహ్నుర్ బవా(పంజాబ్), దేవిక(రాజస్థాన్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు.