Singapore Open : ప్రతిష్ఠాత్మక సింగపూర్ ఓపెన్(Singapore Open) మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ (Treesa Jolly), గాయత్రి గోపీచంద్ (Gayatri Gopichand) జోడీ ప్రస్థానం ముగిసింది. సంచలన విజయాలతో దూసుకెళ్తున్న భారత ద్వయానికి సెమీ ఫైనల్లో చుక్కెదరురైంది. ఫైనల్ బెర్తు కోసం శనివారం జరిగిన పోరులో త్రిసా, గాయత్రి జంట అనూహ్యంగా ఓటమి పాలైంది.
ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జపాన్ జోకీ నమి మత్సుయమ, చిహరు షిదా ధాటికి భారత ద్వయం నిలవలేకపోయింది. తొలి సెట్లో త్రిసా, గాయత్రిలు గట్టిగానే ప్రతిఘటించినా.. రెండో సెట్లో తేలిపోయారు. దాంతో, 21-23, 11-21తో మ్యాచ్ చేజార్చుకున్నారు. దాంతో, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 ఈవెంట్లో తొలి టైటిల్ గెలవాలనుకున్న త్రిసా, గాయత్రిల కల చెదిరింది.
Treesa-Gayatri’s dream run comes to an end against WR-4 🇯🇵 duo. 🥺
Proud of the sensational show put up by youngsters this week, beating World No. 2️⃣ & 6️⃣ on their way towards this semifinal. Keep up the good work champs. 🙌
📸: @badmintonphoto#SingaporeOpen2024#Badminton pic.twitter.com/gLmPQMrTMW
— BAI Media (@BAI_Media) June 1, 2024
స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌లు వెనుదిరిగిన చోట త్రిసా, గాయత్రి జోడీ జోడీ సంచలనం సృష్టించింది. ప్రీ – క్వార్టర్స్‌లోనే వరల్డ్ నంబర్ 2కు షాకిచ్చిన ఈ ద్వయం.. క్వార్టర్స్‌లో అదరగొట్టింది. శుక్రవారం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో హాంకాంగ్ జంటపై 18-21, 21-19, 24-22తో గెలుపొందింది. అలా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 ఈవెంట్లో త్రిసా, గాయత్రి జంట తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.