T20 World Cup 2024 | లోగోపై ఒక్కటే నక్షత్రం.. టీమిండియా జెర్సీ ప్రత్యేకత తెలుసా..?
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు (Team India) కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే.. పొట్టి ప్రపంచ కప్ (T20 World Cup)లో భారత ఆటగాళ్లు ధరించే జెర్సీకి ఓ ప్రత్యేకత ఉంది.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు(Team India) కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ బృందం నీలం, నారింజ రంగు, తెలుపు చారలు కలిగిన జెర్సీతో ఆడనుంది. అయితే.. పొట్టి ప్రపంచ కప్(T20 World Cup)లో భారత ఆటగాళ్లు ధరించే జెర్సీకి ఓ ప్రత్యేకత ఉంది. మాములుగా టీ20 మ్యాచుల్లో టీమిండియా జెర్సీపై ఉన్న బీసీసీఐ లోగోపై మూడు స్టార్లు (నక్షత్రపు గుర్తులు) దర్శనమిస్తాయి. కానీ, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ వచ్చేసరికి ఒక్కటే స్టార్ కనిపిస్తుంది.
భారత జట్టు జెర్సీ డిజైన్‌లో ఈ తేడా వెనుక బలమైన కారణం ఉంది. 2007లో టీ20 వరల్డ్ కప్ విజయానికి గుర్తుగా.. ఈ మెగా టోర్నీ ప్రతి సీజన్లో టీమిండియా ఒక్కటే స్టార్ ఉన్న జెర్సీతో ఆడడం ఆనావాయితీగా వస్తోంది. ఇక రెగ్యులర్ టీ20 జెర్సీలపై కనిపించే మూడు స్టార్లు భారత జట్టు మూడు వరల్డ్ కప్ విజయాలకు ప్రతీక. 1983లో తొలిసారి వన్డే వరల్డ్ కప్ ముద్దాడిన టీమిండియా.. ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో మరోసారి వన్డే ప్రపంచ కప్ చాంపియన్‌గా నిలిచింది.

వాళ్లకు ఇదే ఆఖరు
వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పైగా జట్టులోని సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీ(Virat Kohli), చాహల్, సూర్యకుమార్‌లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్. దాంతో, 11 ఏండ్లుగ ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని పట్టేసి వాళ్లకు విజయంతో వీడ్కోలు పలకాలని జట్టు మొత్తం భావిస్తోంది. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఏకైక వామప్ మ్యాచ్‌కు సిద్దమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు రాత్రి 8 గంటలకు బంగ్లాదేశ్(Bangladesh)తో తలపడనుంది. అనంతరం జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
Nassau County International Cricket Stadium gears up for the warm-up match between India and Bangladesh ahead of the #T20WorldCup 🏏
Purchase tickets to Premium Club Lounge for the massive games in New York, including India vs. Pakistan 👉 https://t.co/DwUbSZcDGm pic.twitter.com/e69wZuEu1J
— ICC (@ICC) May 31, 2024
ఇవి కూడా చదవండి
- Revanth Reddy | బలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిలా మారారు.. బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- TG Weather | తెలంగాణలో ఇక వానలే వానలు..! ఈ జిల్లాల్లో ఐదురోజులు భారీ వర్షాలు..!
- Tyson Naidu | రాజస్థాన్‌లో శరవేగంగా బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ షూటింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

