Revanth Reddy | బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన.. లోగోలో చార్మినార్ను తొలగించే దమ్ము, ధైర్యం ఉందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం పాలకుల చిహ్నాలు, ఆనవాళ్లను తొలగిస్తామని హెచ్చరించారు. ఇక రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు రూ.25వేలు ఎప్పుడు ఇస్తారని ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. బలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిగా మారారని విమర్శించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.