Bellamkonda Sai Srinivas | ఛత్రపతి వంటి భారీ డిజాస్టర్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం టైసన్ నాయుడు. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. 14 రీల్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే సీరియస్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో శరవేగంగా జరుపుకుంటున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. రాజస్థాన్‌లో 100 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ సెట్స్ నుంచి ఫొటోలను విడుదల చేసింది. ఇక ఈ ఫొటోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైట్ సీన్లో పాల్గోన్నట్లు కనిపిస్తుంది.
#TysonNaidu shooting in full swing
The team is currently shooting a massive action sequence with 100 fighters and 300 junior artists in Rajasthan pic.twitter.com/B2KknoIOWS
— Vamsi Kaka (@vamsikaka) June 1, 2024