2021 ముగింపుకు వచ్చేసింది. సౌతాఫ్రికా కంచుకోట సెంచూరియన్పై భారత జెండా ఎగరేయడంతో ఈ ఏడాదికి టీమిండియా ముగింపు పలికింది. మళ్లి సోమవారం నాడు రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ క్రమంలో 2021 ఏడాదిలో భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల వివరాలు తెలుసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున హిట్మ్యాన్ రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 35 ఇన్నింగ్సులు ఆడిన అతను.. 1420 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత 1116 పరుగులతో రిషభ్ పంత్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాటో కోహ్లీ.. 964 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 927 పరుగులతో నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్. 702 పరుగులతో ఐదో స్థానంలో ఛటేశ్వర్ పుజారా నిలిచారు.
ఓవరాల్గా చూసుకుంటే టెస్టు క్రికెట్లో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంగ్లండ్ సారధి జోరూట్ నిలిచాడు. అతను 61.00 సగటులో ఈ ఏడాది మొత్తం 1708 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్లో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్.. 705 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. టీ20ల్లో 1326 పరుగులతో పాక్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ తొలి స్థానంలో ఉన్నాడు.