T20 World Cup Win : భారత జట్టు రెండోసారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడిని రోజులు కళ్లముందు మొదులుతున్నాయి. రోహిత్ శర్మ (Rohit Sharma) టైటిల్‌ను సగర్వంగా చేతుల్లోకి రోజులు.. నెలలు కాదు ఏడాది అవుతోంది. అవును.. సరిగ్గా ఇదే రోజు సఫారీలపై చిరస్మరణీయ విజయంతో ట్రోఫీని ఎగరేసుకుపోయింది టీమిండియా. భారత పురుషుల క్రికెట్ జట్టు ఖాతాలో నాలుగో ఐసీసీ ట్రోఫీ చేరిన జూన్ 29ను ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఇంకేముంది.. బార్బడోస్ గడ్డమీద రోహిత్ బృందం పొట్టి ప్రపంచ్ కప్‌ను అందుకున్న దృశ్యాలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి.
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్‌లో భారత జట్టు అజేయంగా ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా బౌలర్ల విజృంభణతో ప్రధాన బ్యాటర్లు విఫలమైనా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో పోరాడగలిగే స్కోర్ అందించాడు. అనంతరం ఛేదనలో సఫారీ బ్యాటర్లు చెలరేగిపోయారు. హెన్రిచ్ క్లాసెన్(52), క్వింటన్ డికాక్(39)లు ధనాధన్ ఆడి ట్రోఫీని లాగేసుకున్నంత పని చేశారు. మ్యాచ్ చేజారుతున్న వేళ బుమ్రా సంచలన స్పెల్‌తో రోహిత్ సేన పోటీలోకి వచ్చింది.
On this day #RohitSharma𓃵 pic.twitter.com/VYoi8S9jiM
— Karthick (@SelvaRo_Stan) June 28, 2025
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఆడిన బంతిని సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ దగ్గర అందుకోగా భారతావని పులకించిపోయింది. రెండోసారి పొట్టి ఫార్మాట్లో ఇండియా జగజ్జేతగా నిలిచింది. అయితే గుండెలు ఉప్పొంగిన ఈ సంబురంలో అభిమానులకు మింగుడు పడని విషయం ఏంటంటే.. ట్రోఫీ గెలుపిందిన సంతోషంలోనే దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజాలు టీ20లకు వీడ్కోలు పలికారు.
A day I’ll never forget. A day we’ll never forget. For all of us, India 🇮🇳❤️ pic.twitter.com/gWxxbdcCv0
— hardik pandya (@hardikpandya7) June 29, 2025
ఐసీసీ 2007లో తొలిసారి నిర్వహించిన పొట్టి ప్రపంచకప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఇండియా విశ్వవిజేతగా అవరించింది. అప్పుడు కూడా ఉత్కంఠ పోరులోనే గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది భారత జట్టు. ఆఖరి ఓవర్లో దాయాది పాకిస్థాన్ బ్యాటర్ మిస్బావుల్ హక్ క్యాచ్‌ను శ్రీశాంత్ ఒడిసిపట్టుకోగానే యావత్ దేశమంతా సంబురాల్లో మునిగిపోయింది. ధోనీ సేన నిర్దేశించిన 158 పరుగుల ఛేదనలో పాక్ గెలపువాకిట తడబడింది. చిరకాల ప్రత్యర్థిని 152కే ఆలౌట్ చేసిన టీమిండియా 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
The start of MS Dhoni era!#OnThisDay in 2007, India beat Pakistan to win inaugural T20 World Cup.
(Via @BCCI) pic.twitter.com/QDkMjqjm9Q
— Jist (@jist_news) September 24, 2017