Keshav Maharaj : దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) అరుదైన ఫీట్ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రెండొందల వికెట్లు తీసిన తొలి సఫారీ స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో ఆదివారం అతడు ఈ మైలురాయికి చేరువయ్యాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్‌ను ఔట్ చేసి 200 వికెట్ల క్లబ్లో చేరాడు.
లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో మహరాజ్ 199వ వికెట్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని ఔట్ చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ తీయలేకపోయాడు. అయితే.. జింబాబ్వేతో క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి టెస్టులో మహరాజ్ కెప్టెన్‌గానే కాదు బౌలర్‌గానూ రాణించాడు.
Keshav Maharaj becomes the first South Africa spinner to take 200 Test wickets ⭐🇿🇦 pic.twitter.com/u7KtpnglhS
— ESPNcricinfo (@ESPNcricinfo) June 29, 2025
డేంజరస్ క్రెగ్ ఇర్విన్‌ను ఔట్ చేసిన రెండొందల వికెట్ ఖాతాలో వేసుకున్న సఫారీ సారథి.. ఆ తర్వాత సెంచరీ వీరుడు సీన్ విలియమ్స్‌ను పెవిలియన్ పంపాడు. చివరి బ్యాటర్ అయిన తనక చివంగాను ఔట్ చేసి జింబాబ్వే ఇన్నింగ్స్‌కు తెరదించాడీ స్పిన్నర్.
పేసర్లకు పేరుగాంచిన దక్షిణాఫ్రికా జట్టులో మిస్టరీ స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్న మహరాజ్.. తొమ్మిదేళ్లుగా టెస్టులు ఆడుతున్నాడు. ఈ సుదీర్ఘ కెరియర్లో అతడు ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అతడు.. ప్రస్తుతం సఫారీల తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ ఆఫ్ స్పిన్నర్ హుగ్ టేఫీల్డ్ (Hugh Tayfield) 170 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 116 మ్యాచుల్లో మహరాజ్ 631 వికెట్లు పడగొట్టాడు.