Suicide | కొండాపూర్, జూన్ 29 : భవనం పైనుంచి దూకి గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరంభ టౌన్షిప్లో ప్రసాద్ రావు, కుమారి(33) దంపతులు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా కుమారి గత కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతుంది. ఇదే క్రమంలో శనివారం రాత్రి కుమారి భవనంపై నుంచి కిందకు దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.