Team India Squad | వచ్చే నెల ఇంగ్లాండ్ (England)తో జరిగే మూడు వన్డేల సిరీస్ ( ODI Series) కు భారత జట్టును శనివారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)కి ముందు జరిగే వన్డే సిరీస్‌లో సెలక్షన్ కమిటీ కేఎల్ రాహుల్ (KL Rahul) కు జట్టులో చోటు కల్పించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)కి వన్డే జట్టులోనూ అవకాశం ఇచ్చింది. జనవరి 22 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియాను నడిపించనున్నాడు.
ఇక వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వం వహిస్తాడు. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచులకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు మూడు వన్డేలో ఆడడం విషయంలోనూ స్పష్టత లేదు. జట్టును ప్రకటించే సమయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సైతం చాంపియన్స్ ట్రోఫీ వరకు జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నామన్నారు. బుమ్రా ఫిట్‌గా లేకపోతే.. అతని స్థానంలో హర్షిత్ రాణా అందుబాటులో ఉంటాడు. ఇక హైదరబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సైతం ఎంపిక చేయని విషయం తెలిసిందే. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు తొలిసారిగా వన్డే జట్టులో అవకాశం లభించింది.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ కెప్టెన్‌గా, శుభ్‌మాన్ గిల్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డేల్లో హిట్‌మ్యాన్‌తో కలిసి వన్డేల్లో విరాట్ సైతం ఆడనున్నాడు. ఇద్దరు దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఇద్దరూ ఈ ఫార్మాట్లో ఆడనుండడం గమనార్హం. గతంలో భారత జట్టు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు టీమ్ ఇండియాను 2-0తో ఓడించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో సిరీస్‌కు రోహిత్, కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.
ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో నలుగురు స్పిన్నర్లకు సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేసింది. టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా అక్షర్‌ను నియమించిన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ టీమిండియాతో చేరాడు. గత ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గాయపడ్డ విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో పునరాగమనం చేసేందుకు రెడీ అయ్యాడు.
ఇంగ్లాండ్‌తో స్వదేశంలో భారత జట్టు మూడు వన్డేలు ఆడుతుంది. అంతకు ముందు ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడుతుంది. తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్‌పూర్ వేదికగా జరుగుతుంది. ఇక రెండో వన్డే ఫిబ్రవరి 9న ఆదివారం కటక్‌లో ఉంటుంది. ఇంక మూడో వన్డే ఫిబ్రవరి 12న బుధవారం అహ్మదాబాద్ వేదిక జరుగుతుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
Team India | బీసీసీఐ ఆంక్షలతో ఆటగాళ్ల విముఖత..! రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
India Squad: సిరాజ్, శాంసన్ ఔట్.. వైస్ కెప్టెన్‌గా గిల్.. చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదే