ముంబై: ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీతో పాటు త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేలకు భారత జట్టును (India Squad)ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ .. ఇవాళ మీడియాతో మాట్లాడారు. వన్డేలకు శుభమన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. 15 మంది బృందంలో మహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్‌లకు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ, గిల్, జైస్వాల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, హర్షదీప్ సింగ్ బృందంలో ఉన్నారు.
అయితే ఇంగ్లండ్‌తో జరిగే వన్డేలకు బుమ్రా ఆడడంలేదు. ఫిబ్రవరిలో అతని ఫిట్నెస్ను అంచనా వేయనున్నారు. ఒకవేళ బుమ్రా ఫిట్ అయితే ఆ టోర్నీలో అతను ఆడుతాడు. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాకు చోటు కల్పించారు.
కరుణ్ నాయర్‌కు పిలుపు రాలేదు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో అతను 7 ఇన్నింగ్స్‌లో 752 రన్స్ చేశాడు. వన్డే టోర్నీలకు అతన్ని ఎంపిక చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ సెలెక్టర్లు పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. బ్యాటర్లు అందరూ 40 యావరేజ్‌తో ఉన్నారని, అందుకే నాయర్‌ను ఎంపిక చేయడం కష్టమైందని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తెలిపాడు.
ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వన్డే జట్టులో చోటు దక్కలేదు. శ్రీలంకతో జరిగిన వన్డేలకు గిల్ కెప్టెన్‌గా చేశాడని, అతని గురించి డ్రెస్సింగ్ రూమ్ నుంచి మంచి అభిప్రాయాలు వచ్చాయని, అందుకే అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు అగార్కర్ తెలిపాడు.
భారత జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), జైస్వాల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, హర్షదీప్ సింగ్