Team India | సొంతగడ్డపై జైత్రయాత్ర.. టీమిండియా ఖాతాలో పదిహేడో సిరీస్
Team India : సొంతగడ్డపై తమకు తిరుగలేదని భారత జట్టు(Team India) మరోసారి చాటింది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయంతో టీమిండియా టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. బజ్ బాల్(Buzz Ball) ఆటతో ప్రత్యర్ధులను వణికించిన..
Team India : సొంతగడ్డపై తమకు తిరుగలేదని భారత జట్టు(Team India) మరోసారి చాటింది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయంతో టీమిండియా టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో, స్వదేశంలో రికార్డు స్థాయిలో 17వ టెస్టు సిరీస్ ఖాతాలో వేసుకుంది. బజ్ బాల్(Buzz Ball) ఆటతో ప్రత్యర్ధులను వణికించిన ఇంగ్లండ్ (England)కు రాంచీలో భారత జట్టు తొలి సిరీస్ ఓటమిని రుచి చూపించింది.
టర్నింగ్ పిచ్‌పై యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్(52 నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్)లు స్టోక్స్ సేనకు పరీక్ష పెట్టారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో 192 పరుగుల ఛేదనలో 5 వికెట్ల తేడాతో భారత్ విజయ ఢంకా మోగించింది. ఉప్పల్ టెస్టు ఓటమి తర్వాత పుంజుకున్న రోహిత్ బృందం సంచలన ప్రదర్శనతో వరుసగా మూడు మ్యాచుల్లో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్‌కు చెక్ పెట్టింది.
An unbeaten 72*-run partnership between @ShubmanGill & @dhruvjurel21 takes #TeamIndia over the line!
India win the Ranchi Test by 5 wickets 👏👏
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ORJ5nF1fsF
— BCCI (@BCCI) February 26, 2024
స్వదేశంలో వరుసగా 17వ సిరీస్ విజయం నమోదు చేసింది. మ్యాచ్ గెలిచిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులంతా సంబురాల్లో మునిగిపోయారు. వరుసగా మూడో విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో టీమిండియా రెండో స్థానం పదిలం చేసుకుంది.
A fantastic victory in Ranchi for #TeamIndia 😎
India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d
— BCCI (@BCCI) February 26, 2024
స్వదేశంలో భారత జట్టు 2012లో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ కోల్పోయింది. అలెస్టర్ కుక్ సారథ్యంలోని ఇంగ్లండ్ 2-1తో సిరీస్ వశం చేసుకుంది. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌ను కూడా భారత జట్టు డ్రా చేసుకోలేదు. అన్ని సిరీస్‌లలో జయకేతనం ఎగురవేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల ఛేదనలో భారత్ ఒకదశలో 120కే సగం వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్ ద్వయం బషీర్, హర్ట్లే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ బోర్డు నత్తనడకను తలపించింది. స్టేడియంలో, టీవీల ముందు కూర్చున్న అభిమానుల్లో మ్యాచ్ చేజారుతుందా? అనే అనుమానం మొదలైంది.
After solid resistance with the bat, Shubman Gill clears the ropes twice and brings up his FIFTY! 😎#TeamIndia only 2 runs away from a win in Ranchi!
Follow the match ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/zahlGUrYQG
— BCCI (@BCCI) February 26, 2024
కానీ, కుర్రాల్లు శుభ్‌మన్ గిల్(55 నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్) అసలు పట్టు విడిస్తేగా. ఓపికగా క్రీజులో నిలబడిన ఈ ఇద్దరూ ఇండ్లండ్ కెప్టెన్ వ్యూహాల్ని చిత్తు చేశారు. చకాచకా సింగిల్స్ తీస్తూ ఒత్తిడిని ఊదేశారు. ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించారు. దాంతో, మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా 3-1తో సిరీస్ గెలిచింది. నామమాత్రమైన ఐదో టెస్టు మార్చి 7న ధర్మశాలలో జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Viral Video | ఆపరేషన్ థియేటర్లో గుట్కా నలిచిన రోగి.. అనస్థషీయా మత్తులో అలా చేశాడా..?
- Bull stops play | క్రికెట్ మ్యాచ్‌ను ఆపేసిన ఎద్దు.. తలోదిక్కు పరుగెత్తిన కుర్రాళ్లు.. వీడియో
- Need A Wife | భార్య కావాలంటూ ఆటోకు హోర్డింగ్ పెట్టిన వ్యక్తి.. వధువు కోసం వినూత్న ప్రకటన
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

