Arvind Kejriwal | జైల్లో కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు : ఎయిమ్స్ వైద్యులు
Arvind Kejriwal | ఎక్సైజ్ పాలసీకి (Excise policy) సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది.
Arvind Kejriwal | ఎక్సైజ్ పాలసీకి (Excise policy) సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. టైప్-2 డయాబెటీస్‌తో బాధపడుతున్న కేజ్రీ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు చెందిన మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్రస్తుతం కేజ్రీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ధ్రువీకరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సుమారు అరగంట పాటు సీఎంతో మాట్లాడిన ఎయిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సదరు కథనాలు తెలిపాయి. మెడిసిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని సూచించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం మరోసారి సీఎంను పరీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు తెలిసింది.
కాగా, కేజ్రీవాల్ ఒంట్లోని చక్కెర స్థాయిలు 320కి పెరగడంతో గతవారం తొలిసారి ఆయనకు జైలులో ఇన్సులిన్ డోస్ ఇచ్చిన విషయం తెసిందే. దీంతో తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించే అవకాశం ఇవ్వాలని ఇటీవలే కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అయితే, కేజ్రీ అభ్యర్థనకు ఈడీ అడ్డుపడింది. ఆరోగ్య కారణాలతో బెయిల్ పొందేందుకు చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే మామిడిపండ్లు, ఆలూ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారని ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆయనకు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా..?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా..? అని పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఐదుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్ మెడికల్ బోర్డు.. తాజాగా కేజ్రీ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది.
Also Read..
Qutub Minar | లోక్‌సభ ఎన్నికల వేళ.. త్రివర్ణంలో కుతుబ్ మినార్
Samantha | ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం చిన్న విషయం కాదు.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సమంత
Miss Universe | అందాల పోటీల్లో 60 ఏళ్ల భామకు కిరీటం.. చరిత్రలో ఇదే తొలిసారి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

