Need A Wife | భార్య కావాలంటూ ఆటోకు హోర్డింగ్ పెట్టిన వ్యక్తి.. వధువు కోసం వినూత్న ప్రకటన
Need A Wife | తనకు భార్య కావాలంటూ ఒక వ్యక్తి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. తన వివరాలతో కూడిన హోర్డింగ్‌ను ఆటోకు ఉంచాడు. వినూత్న ప్రకటన ద్వారా వధువు కోసం అన్వేషిస్తున్నాడు.
భోపాల్: తనకు భార్య కావాలంటూ ఒక వ్యక్తి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. తన వివరాలతో కూడిన హోర్డింగ్‌ను ఆటోకు ఉంచాడు. వినూత్న ప్రకటన ద్వారా వధువు కోసం అన్వేషిస్తున్నాడు. (Need A Wife) మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఈ సంఘటన జరిగింది. 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్ కాబోయే భార్య కోసం వినూత్న విధానాన్ని ఎంచుకున్నాడు. ‘భార్య కావాలి’ అంటూ తన వివరాలతో కూడిన హోర్డింగ్‌ను సొంత ఎలక్ట్రిక్ ఆటోకు ఏర్పాటు చేశాడు. తన ఎత్తు, పుట్టిన తేదీ, సమయం, బ్లడ్ గ్రూప్, విద్యార్హతలు, గోత్రం వంటి వివరాలు అందులో పేర్కొన్నాడు.
కాగా, సమాజంలో మహిళల కొరత వల్ల వధువు లభించడం లేదని దీపేంద్ర వాపోయాడు. తన తల్లిదండ్రులు పూజల్లో బిజీగా ఉండటంతో తనకు భార్యను వెతకలేకపోతున్నట్లు తెలిపాడు. మ్యారేజ్ గ్రూప్‌లో చేరినప్పటికీ నగరానికి చెందిన వధువు దొరకలేదని చెప్పాడు. దీంతో భార్య కావాలంటూ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. తనకు కుల, మత భేదాలు లేవని చెప్పాడు. ఏ మహిళ అయినా పెళ్లి ప్రతిపాదనతో తనను సంప్రదించవచ్చని తెలిపాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండేలా భార్యను చూసుకుంటానని అన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

