England – Team India | ఇంగ్లండ్ టార్గెట్ 248..!
England - Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరుగుతున్న చివరి-ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ముందు టీం ఇండియా 248 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
England – Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరుగుతున్న చివరి-ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ముందు టీం ఇండియా 248 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. తొలుత టాస్ గెలుచుకున్న ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత్ ఓపెనర్లు సంజూ శాంసంన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు దిగినా సంజూ శాంసన్ ఏడు బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 16 పరుగులు చేశాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోఫ్రా అర్చర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.
వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ, సారధి సూర్య కుమార్ యాదవ్ వెంటవెంటనే ఔటయినా అభిషేక్ శర్మ క్రీజ్‌లో నిలుచుండి పోయాడు. 37 బంతుల్లో స్పీడ్‌గా సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ నిలకడగా ఆడి స్కోర్ పెంచాడు. మొత్తం 54 బంతుల్లో 135 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శివం దూబె 13 బంతుల్లో 30 పరుగులు, అక్సర్ పటేల్ 15 పరుగులుచేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు, మార్క్ వుడ్ రెండు, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, అదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

