Team India | బార్బడోస్లో ‘తుఫాన్’.. టీమిండియా రాక ఆలస్యం..?
Team India : సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం తయారైపోయింది. అయితే.. రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది.
Team India : పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొందిన రోహిత్ శర్మ(Rohit Sharma) బృందం యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచేసింది. 13 ఏండ్ల ట్రోఫీ కలను సాకారం చేసి ఐసీసీ టైటిళ్ల సంఖ్యను నాలుగుకు చేర్చింది. దాంతో, సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం తయారైపోయింది. అయితే.. రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది.
ఎందుకంటే.. ఫైనల్ మ్యాచ్కు వేదికైన బార్బడోస్ (Barbados)కు తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ‘బెరిల్’ (Beryl) అనే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా బార్బడోస్ ఎయిర్పోర్ట్ను మూసివేయనున్నారు. దాంతో, భారత జట్టు ఒకటి రెండు రోజులు టీమ్ హోట్లోనే ఉంటుందని సమాచారం.
Hurricane Beryl will hit Barbados either tonight or early morning Monday. The landfall is going to be severe. Barbados airport will shut down and flights are being cancelled. Even the Indian team will be stuck here till the Hurricane subsides and airport resumes.
We are stuck…— Vikrant Gupta (@vikrantgupta73) June 30, 2024
‘బెరిల్ తుఫాన్ ఈ రోజు జూన్ 30 ఆదివారం రాత్రి లేదా సోమవారం(జూలై 1) ఉదయం బార్బడోస్ తీరాన్ని తాకనుంది. దాంతో, ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశముంది. అందుకని అధికారులు బార్బడోస్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేయనున్నారు. టీమిండియా కూడా ఇక్కడే హోటల్లో చిక్కుకొనే చాన్స్ ఉంది. తుఫాన్ తీవ్రత తగ్గాక ఎయిర్పోర్టును తెరుస్తారు. ఆ తర్వాతే భారత బృందం స్వదేశానికి బయల్దేరనుంది’ అని ఇండియాటుడే ప్రతినిధి విక్రాంత్ గుప్తా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి
- Michael Vaughan | పాక్ దిగ్గజం కాదు.. అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ బుమ్రానే
- BTPS | బీటీపీఎస్ అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం సమీక్ష
- Sharad Pawar | అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తాం : శరద్ పవార్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

