BTPS | బీటీపీఎస్ అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం సమీక్ష
BTPS | భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో ప్రమాదంపై ఆరా తీశారు.
BTPS | భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో ప్రమాదంపై ఆరా తీశారు. పిడుగుపాటు కారణంగా జరిగిన ప్రమాదంలో వాటిల్లిన నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం తీవ్రత పెరుగకుండా కేవలం గంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. సమీపంలో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరు, పినపాక, అశ్వాపురంల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తనిఖీ చేయడానికి సోమవారం భోపాల్ నుంచి బీహెచ్ఈఎల్ బృందం వస్తున్నట్లు పేర్కొన్నారు. నిపుణుల పరిశీలన అనంతరం నష్టానికి సంబంధించిన అంచనా వస్తుందని పేర్కొన్నారు. అయితే, ప్రమాదంపై సమగ్ర నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులకు భట్టి ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, చీఫ్ ఇంజినీర్ రత్నాకర్, బిచ్చన్నలను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

