సౌథాంప్టన్: ఇంగ్లండ్‌లో మొత్తానికి ఇండియన్ ప్లేయర్స్ అంతా మళ్లీ కలిశారు. గురువారం ఉదయం ఓ గ్రూపుగా ప్రాక్టీస్ చేశారు. ఎజియస్ బౌల్ స్టేడియం పక్కనే ఉన్న గ్రౌండ్లో టీమంతా సాధన చేసింది. ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన తర్వాత మూడు రోజుల పాటు ఒకరినొకరు కనీసం కలుసుకునే వీలు కూడా లేకుండా చేశారు. ఆ తర్వాత టీమ్‌ను గ్రూపులుగా విభజించి ప్రాక్టీస్ చేయించారు. మొత్తానికి గురువారం అందరినీ కలిసి ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.
దీనికోసం గురువారం నుంచే టీమ్‌లోని ప్లేయర్స్ అంతా ఒకేసారి జిమ్‌లో కసరత్తులు చేయడానికి, ఆ తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతించారు. కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో టీమిండియా చెమటోడ్చింది. ఈ విషయాన్ని చెబుతూ బీసీసీఐ తన ట్విటర్లో వీడియో పోస్ట్ చేసింది. నెట్ సెషన్లో కెప్టెన్ కోహ్లితోపాటు రోహిత్ శర్మ, పుజారా, పంత్‌లాంటి ప్లేయర్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇషాంత్, సిరాజ్, షమి, బుమ్రా, అశ్విన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఫీల్డింగ్ సెషన్ కూడా జరిగింది.
We have had our first group training session and the intensity was high 🔥#TeamIndia's 🇮🇳 preparations are on in full swing for the #WTC21 Final 🙌 pic.twitter.com/MkHwh5wAYp
— BCCI (@BCCI) June 10, 2021