Vikram Rathour : భారత జట్టు మాజీ కోచ్ విక్రమ్ రాథోర్(Vikram Rathour) మళ్లీ రంగంలోకి దిగాడు. టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించిన విక్రమ్ తాజాగా న్యూజిలాండ్(Newzealand) జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు. త్వరలోనే అఫ్గనిస్థాన్‌తో కివీస్ ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ అనుభవజ్ఞుడైన రాథోర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది.
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ రంగన హెరాత్(Rangana Herath) స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. హెరాత్‌ను శ్రీలంతో జరుగబోయే రెండు టెస్టులకు కూడా కొనసాగిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. ‘ఆసియాలో జరుగబోయే మూడు టెస్టులకు రంగన హెరాత్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్ అఫ్గనిస్థాన్‌తో నోయిడాలో జరుగబోయే ఏకైక టెస్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు’ అని న్యూజిలాండ్ క్రికెట్ ఓ ప్రకటనలో తెలిపింది.
Rangana Herath has been appointed as spin-bowling coach for the three upcoming Tests in Asia while former Indian batting coach Vikram Rathour has joined the BLACKCAPS for the one-off Test in Noida against Afghanistan. #AFGvNZ #SLvNZ https://t.co/faF2cFarMo
— BLACKCAPS (@BLACKCAPS) September 6, 2024
రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ పనిచేశాడు. టీ20 వరల్డ్ కప్ ముందే ద్రవిడ్‌తో సహాయక బృందం కాంట్రాక్ట్ ముగిసింది. అయితే.. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ద్రవిడ్ బృందం కాంట్రాక్ట్‌ను జూలై 1 వరకూ పొడిగించింది.
రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోర్
అనంతరం ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్(Gautam Gambhir) తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ రాథోర్‌ను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సంప్రదించింది. అఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు, అనంతరం లంకతో సిరీస్‌కు అతడిని బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది.