Vaddepalli Krishna | టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీగేయ(Film Lyricist) రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (సెప్టెంబర్ 6)న ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోచేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాగోల్ లో స్థిరపడ్డారు. సి.నారాయణరెడ్డిగారి రచనలంటే ఆయనకు ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు గతంలో కృష్ణ వెల్లడించారు.
భానుమతి దర్శకత్వం వహించిన ‘రచయిత్రి’ సినిమా కోసం రైటర్‌గా మారారు కృష్ణ. అయితే ఈ సినిమా ఆలస్యంగా విడుదల కావడం దీనికంటే ముందు ‘పిల్ల జమీందార్’ సినిమా విడుదల కావడంతో ఈ చిత్రం ఆయన మొదటి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. వడ్డేపల్లి కృష్ణ రెండు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించారు. 2017 లో వచ్చిన లావణ్య విత్ లవ్‌బాయ్స్ డైరెక్ట్ చేశారు.
అలాగే అంతరించి పోతున్న గోవులపై గోభాగ్యం అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో బహుమతులు గెలుచుకుంది. బతుకమ్మ, ఆత్మహత్య, నేతన్నలు వంటి డాక్యుమెంటరీలను తీసి జాతీయస్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నాడు. టెలివిజన్‌లో భక్త కవి పోతన, భారతీయ సంస్కృతీ శిఖరాలు వంటి సీరియల్స్‌ను డైరెక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రచయితగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్‌గా, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గా, పాడుతా తీయగా పాటల కార్యక్రమానికి జడ్జిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందాడు కృష్ణ.
Also Read..