Pawan Khera : సెబీ చైర్‌పర్సన్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెబీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై రోజుకో వివాదం వెలుగులోకి వస్తుంటే తాజాగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. మాధవి పురి బుచ్, ఆమె భర్త పేరిట ముంబైలో కరోల్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ పేరున ఓ కంపెనీ ఉందని అన్నారు. వాకార్డ్లో ఈ కంపెనీ అంతర్భాగమని, ఈ కంపెనీకి అదే ప్రమోటర్లు ఉన్నారని ఆరోపించారు. వాకార్డ్ కంపెనీపై సెబీ నిరంతరం ఆదేశాలు ఇస్తోందని, దాని కేసులను పర్యవేక్షిస్తోందని చెప్పారు.
వాకార్డ్పై ఫిర్యాదులను పరిశీలిస్తున్న సెబీ చైర్పర్సన్ కూడా మాధవి పురి బుచ్ అని గుర్తుచేశారు. దీనిపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు కూడా ఉందని, వాకార్డ్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును కూడా మాధవి సంస్ధ (సెబీ) పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఇది పరస్పర ప్రయోజనాల సంఘర్షణ కిందకు వస్తుందని, ఇది అవినీతేనని తాను పేర్కొంటానని ఆరోపించారు. ఇది పూర్తిగా అవినీతి కేసేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, పవన్ ఖేరా ఇటీవల సెబీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై పలు ఆరోపణలు గుప్పించారు.
సెబీ చైర్‌పర్సన్‌గా ఉంటూ ఆమె లాభదాయక పదవిలో ఉన్నారని వెల్లడించారు. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, దాని అసెట్ మేనేజ్మెంట్ విభాగం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి నిరంతర ఆదాయం పొందుతున్నారని పవన్ ఖేరా ఆరోపించారు. ఈ కంపెనీల్లో వేతనం తీసుకుంటూ ఆపై క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్ధ సెబీ హోల్‌టైమ్ మెంబర్‌గా ఉంటూనే, చైర్పర్సన్ అయ్యారని తెలిపారు. మాధవి బుచ్ 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెంట్ నుంచి వేతనంగా ఏకంగా రూ. 16.80 కోట్లు పొందారని చెప్పారు.
Read More :
AP News | అప్పుడు జగన్ తీసుకొచ్చిన వాహనాలే ఇప్పుడు చంద్రబాబుకు దిక్కు అయ్యాయి: వైసీపీ