Gurram Papi Reddy | టాలీవుడ్ యువ నటుడు నరేష్ అగస్త్య, ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన క్రేజీ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గుర్రం పాపిరెడ్డి. గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 (Zee5) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 16, 2026 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కానుంది. “జర భద్రం… ఇదంతా మోసం!” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, పండుగ సెలవుల్లో ఓటీటీ ప్రియులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) ఎలాగైనా తక్కువ సమయంలో కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలోనే నర్స్ సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి ఒక ‘డెడ్ బాడీ’ మార్పిడికి సంబంధించిన రిస్కీ ప్లాన్ వేస్తాడు. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన వింత మనుషులు, ఊహించని ట్విస్టులు, అడుగడుగునా పండించే నవ్వుల సమాహారమే ఈ సినిమా. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కోలీవుడ్ స్టార్ కామెడీ నటుడు యోగి బాబు కీలక పాత్రల్లో నటించడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. వీరిద్దరి టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో మెరిశారు.
Jara Bhadram – Idhi anthaa mosam!#GurramPapiReddy vastunnadu – Telugu Zee5 ki
Premieres 16th January#TeluguZee5 #GurramPapiReddy #GurramPapiReddyOnZee5 #FariaAbdullah #YogiBabu pic.twitter.com/B6GcR3Sssn— ZEE5 Telugu (@ZEE5Telugu) January 8, 2026