Sujeet Kumar : ప్రముఖ న్యాయవాది, ఎంపీ సుజీత్ కుమార్ (Sujeet Kumar) పై బిజూ జనతాదళ్ (BJD) పార్టీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో బీజేడీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పేరుతో ఆ ప్రకటన విడుదలైంది. దాంతో సుజీత్కుమార్ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్ కుమార్ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కఢ్ ఆమోదించారు.
BJD expels party leader Sujeet Kumar for “anti-party activities.”
He resigned from Rajya Sabha and his resignation has been accepted by Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar. pic.twitter.com/asjLLxpnOw
— ANI (@ANI) September 6, 2024