యాదాద్రి భువనగిరి : తెలంగాణ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి(Jitta Balakrishna Reddy) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు, జిట్టా అభిమానులు అడ్డగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి (Komatireddy Venkatareddy)ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న జిట్టా బాలకృష్ణా రెడ్డి అంత్యక్రియలపై ప్రభుత్వం స్పందింకపోవడం పట్ల స్థానికంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తున్నాయి.
ఓ ఉద్యమకారుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.