హోమిల్టన్: ప్రపంచకప్ మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌పై 155 పరుగుల తేడాతో విజయం సాధించడంతో మనళ్ల ఆట తీరు మారదా? అని ప్రశ్నించిన విమర్శకుల నోళ్లకు తాళాలేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు వెస్టిండీస్‌కు 318 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్రతిస్పందనగా వెస్టిండీస్ జట్టు 40.3 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టులోని స్మృతి మంధాన, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన సెంచరీలతో కదం తొక్కడంతో ప్రమాదకర ప్రత్యర్థి వెస్టిండీస్ జట్టు తోక ముడియాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో బౌలర్ జులన్ గోస్వామి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ బ్యాటర్ అనీషా మహమ్మద్ వికెట్ తీసి అత్యధిక వికెట్లు (40) తీసిన బౌలర్‌గా జులన్ గోస్వామి నిలిచారు.
వెస్టిండీస్‌పై మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం. అంతకుముందు 1993, 1997, 2005, 2009, 2013, 2017ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా చేతిలో వెస్టిండీచ్ ఓడింది. వెస్టిండీస్ జట్టుకు ప్రారంభంలో మంచి ఆరంభం లభించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు మేఘనా సింగ్, స్నేహ్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి వెస్టిండీస్ నాలుగు వికెట్లు తీయడంతో వారి పతనం ప్రారంభమైంది. ఓపెనర్ డియాండ్రా డాటిన్ 46 బంతుల్లో 62 పరుగుల వద్ద ఔటైంది. డోటిన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించి షార్ట్ ఫైన్ లెగ్ వద్ద మేఘనాకు క్యాచ్ ఇచ్చింది. 43 పరుగులు చేసిన హేలీ మాథ్యూస్ స్నేహ ఫ్లైడ్ బంతిని అర్థం చేసుకోలేక వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. డియాండ్రా డాటిన్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత్ బౌలర్ స్నేహ రానా 3 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. మంధాన 119 బంతుల్లో 123 పరుగులు చేయగా.. హర్మన్‌ప్రీత్ 109 పరుగులు సాధించింది. వీరిద్దరు కలిసి 184 పరుగుల భాగస్వామ్యం అందించారు. వెస్టిండీస్ బౌలర్ అనీస్ మహమ్మద్ 59 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. సాల్మన్ 43 పరుగులకు ఒక వికెట్ తీసింది. ప్రపంచ కప్‌లో టీమిండియా తొలిసారి 300 పరుగుల మార్క్‌ను దాటింది.