Team India : ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా(Team India) రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 22న పెర్త్ స్టేడియం(Perth Stadium)లో జరిగే తొలి టెస్టుతో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. భారత సీనియర్ జట్టు, భారత ఏ జట్టుతో నంబర్ 15 నుంచి 17 వరకు అంతర్గత స్క్వాడ్ మ్యాచ్ ఆడనుందని సీఏ తెలిపింది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలు ఈసారి ఐదు మ్యాచ్‌లు ఆడనున్నాయి. దాంతో, భారత ఏ జట్టు అక్టోబర్‌లోనే ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్కడ ఆసీస్ ఏ టీమ్‌తో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది.
The rivalry continues to grow 💪
Australia A will take on India A as a prelude to the Border-Gavaskar Trophy this summer as the two top-ranked Test nations prepare for their hugely anticipated showdown. pic.twitter.com/53fZJpGI4k
— Cricket Australia (@CricketAus) May 28, 2024
తొలి మ్యాచ్ అక్టోబర్ 31న షురూ కానుండగా.. రెండో మ్యాచ్ మెల్బోర్న్ మైదానంలో నవంబర్ 7న మొదల్వనుంది. ఆ తర్వాత టీమిండియా సీనియర్, ఏ జట్ల మధ్య ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22న ఆరంభం కానుంది.
1. పెర్త్ స్టేడియంలో – నవంబర్ 22 నుంచి 26 వరకు మొదటి టెస్టు.
2. అడిలైడ్ మైదానంలో – డిసెంబర్ 6 -10 వరకు రెండో టెస్టు.
3. బ్రిస్బేన్ స్టేడియంలో – డిసెంబర్ 14 నుంచి 18 వకు మూడో టెస్టు.
4. మెల్బోర్న్లో – డిసెంబర్ 26 – 30 వరకు నాలుగో మ్యాచ్.
5. సిడ్నీ గ్రౌండ్లో – జనవరి 3 నుంచి 7 వరకు ఐదో టెస్టు.