Telangana | వెయ్యి రూపాయల బిర్యానీ తిన్నందుకు.. లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు కట్టాల్సి వచ్చింది!
Telangana | పెళ్లి రోజు కదా అని హోటల్‌కు వెళ్లి బిర్యాని తినడమే ఆ కుటుంబం చేసిన పాపమైంది. సరదాగా మండి బిర్యాని తింటే.. హోటల్లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీసింది. ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరోచనాలు చేసుకుని ఆస్పత్రిలో చేరేలా చేసింది
Telangana | పెళ్లి రోజు కదా అని హోటల్‌కు వెళ్లి బిర్యాని తినడమే ఆ కుటుంబం చేసిన పాపమైంది. సరదాగా మండి బిర్యాని తింటే.. హోటల్లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీసింది. ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరోచనాలు చేసుకుని ఆస్పత్రిలో చేరేలా చేసింది. వాళ్లు తిన్నది వెయ్యి రూపాయల బిర్యానీ అయితే.. ఆస్పత్రిలో లక్ష రూపాయలు కట్టే పరిస్థితి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
షాద్‌నగర్ మండలం అప్పరెడ్డిగూడ గ్రామంలో కావలి నరేందర్ నివసిస్తున్నాడు. ఈ నెల 22న తన పెళ్లి రోజు కావడంతో కుటుంబసభ్యులతో కలిసి షాద్‌నగర్‌లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ కలిసి మండి బిర్యాని తిన్నారు. కాసేపు అక్కడే సరదాగా గడిపి రాత్రికి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి వెళ్లాక ఒకరి తర్వాత అస్వస్థతకు గురయ్యారు. అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో నరేందర్‌తో పాటు అతని భార్య మంగమ్మ, కుటుంబసభ్యులు దీక్షిత, తన్విక, అనిరుధ్, అభిలాష్, జ్యోత్స్న, సాయి శ్రీకర్ సహా మొత్తం ఎనిమిది మందిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వారందరూ అక్కడే చికిత్స పొందుతున్నారు. వీరిలో రేందర్కు రక్తపు వాంతులు, విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాగా, వారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కలుషిత ఆహారం తినడం వల్లే అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. దీనిపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి రూపాయలు ఖర్చు చేసి బిర్యాని తింటే.. ఆస్పత్రిలో లక్ష రూపాయల బిల్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

