Virat Kohli | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత్‌తో పాటు పలు దేశాల్లోనూ అభిమానులు నిరాశకు గురయ్యారు. కోహ్లీకి అభిమాని అయిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ నేత, ఇస్లామిక్ ఎమిరేట్ ప్రముఖ నాయకుల్లో ఒకరైన అనస్ హక్కానీ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోహ్లీకి స్పెషల్ అప్పీల్ చేశాడు. రోహిత్ రిటైర్మెంట్ సైతం తన స్పందన చెప్పారు. అనస్ హక్కానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రోహిత్ టెస్టు రిటైర్మెంట్ సరైందే. కానీ, కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణాలు నాకు అర్థం కాలేదు. ప్రపంచంలో చాలా తక్కువ మంది ఆటగాళ్లు చాలా ప్రత్యేకం. విరాట్ 50 ఏళ్ల వరకు ఆడాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు. భారత మీడియా కోహ్లీని ఇబ్బంది పెట్టి ఉండవచ్చని.. అందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని హక్కానీ వ్యాఖ్యానించారు. అతనికి ఇంకా సమయం ఉందని.. జోరూట్ సచిన్ టెస్ట్ రికార్డుకు చేరువయ్యాడని గుర్తు చేశాడు.
విరాట్ కోహ్లీ ఈ ఏడాది మే 12న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. పదివేల టెస్ట్ పరుగులకు 770 పరుగులు దూరంలో ఉన్నాడు. అంతకు ముందు మే 7న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత.. టెస్ట్ కెప్టెన్సీని యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించారు. గిల్ కెప్టెన్సీలో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. విరాట్, రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఇద్దరు తిరిగి వస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం, టీమ్ ఇండియా 2025 ఆసియాకప్‌లో ఆడుతున్నది. తొలి మ్యాచ్‌లో యూఏఈని ఓడించింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండు సూపర్ ఫోర్స్‌కు చి రెండుజట్ల మధ్య మ్యాచ్‌ను చూసే అవకాశం ఉంది.